స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ప్రతీ ఏటా వేల సంఖ్యలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS పోస్టుల్ని భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకు టెన్త్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కూడా ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకూ టెన్త్ పాస్ అయితే చాలు. వీటితో పాటు టెన్త్ పాస్ అయినవారికి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు ఉంటాయి. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. మీరు ఈ నోటిఫికేషన్లకు అప్లై చేయనట్టైతే నిరాశపడాల్సిన అవసరం లేదు. మరిన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మరి ఏ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారో, టెన్త్ పాస్ అయినవారు ఆ పోస్టులకు ఎలా అప్లై చేయాలా తెలుసుకోండి.
SSC MTS Recruitment 2021: స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 10వ తరగతి పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. ఖాళీల వివరాలను తర్వాత ప్రకటిస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కానీ ఖాళీల సంఖ్య వేలల్లోనే ఉంటుంది.
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. టెన్త్ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. మొత్తం 1159 ఖాళీలున్నాయి. అందులో 710 పోస్టులు విశాఖపట్నంలోనే ఉన్నాయి. అప్లై చేయడానికి 2021 మార్చి 7 చివరి తేదీ.
RBI Office Attendant Recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. అప్లై చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ. టెన్త్ పాసైతే చాలు
BRO Recruitment 2021: భారత సాయుధ దళాలకు చెందిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్-BRO ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 459 ఖాళీలున్నాయి. టెన్త్ ఇంటర్ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేయడానికి 2021 ఏప్రిల్ 4 చివరి తేదీ. ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
IAF Group C Recruitment 2021: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ సీ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 255 ఖాళీలున్నాయి. అప్లై చేయడానికి 2021 మార్చి 13 చివరి తేదీ. టెన్త్, ఇంటర్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు
NTA DU Recruitment 2021: ఢిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. మొత్తం 1145 పోస్టుల్ని భర్తీ చేస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA