ముంబై: సౌత్‌కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. గెలాక్సీ A-సిరీస్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగిన గెలాక్సీ A32 ఫోన్‌ను ఇవాళ విడుదల చేసింది. కొత్త ఫోన్ డాల్బీ అట్మోస్‌తో పాటు వాటర్‌డ్రాప్ స్టైల్ డిస్ప్లే నాచ్ కలిగి ఉంది. ఈ ఫోన్ షియోమీ ఎంఐ10ఐ, రియల్మీ ఎక్స్ 7, మోటో జీ 5జీ వంటి ఫోన్లతో పోటీపడే అవకాశం ఉంది.
భారత్‌లో 6GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ బ్లాక్, వైట్, బ్లూ, వయలెట్ కలర్లలో లభించనుంది. శాంసంగ్ డాట్‌కామ్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు రిటైల్ స్టోర్ల ద్వారా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 2వేల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.