ముంబై: ప్రమఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఎల్జీ CX లైనప్లో సరికొత్త టీవీని ఆవిష్కరించింది. ఓఎల్ఈడీ టెలివిజన్ విభాగంలో OLED 48 CX టీవీని రిలీజ్ చేసింది. గేమింగ్ ప్రియులు, అద్భుతమై సినిమా అనుభవాన్ని పొందాలనుకునే వారి కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఎల్జీ ఓఎల్ఈడీ టెక్నాలజీని చిన్న టీవీల్లో కూడా తీసుకొచ్చింది. ఇప్పటి వరకు పాపులర్ CX వెర్షన్లో 55 అంగుళాల వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
ఓఎల్ఈడీ 48CX టీవీలో ఎల్జీకి చెందిన ఆల్ఫా 9 జనరేషన్ 3 ప్రాసెసర్ కూడా ఉంది. ఈ కొత్త టీవీ ఎనిమిది మిలియన్ పిక్సెల్స్ కలిగిన వాటికంటే అద్భుతమైన చిత్రాలను చూపిస్తుందని సంస్థ పేర్కొంది. భారత్లో కొత్త టీవీ ధర రూ .1,99,990గా నిర్ణయించారు.