‘సింహా’, ‘లెజెండ్' విజయాల తర్వాత బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘గాడ్‌ఫాదర్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. కథకు సరిపోయేలా పలు శక్తివంతమైన టైటిల్స్‌ను పరిశీలించిన చిత్రబృందం చివరకు ఈ పేరును నిర్ణయించినట్లు తెలిసింది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకురానున్నది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ వికారాబాద్ మండలం కొటాల గూడెంలో జరిపేందుకు చిత్ర బృందం వెళ్ళింది. వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. షూటింగ్ వలన పంట పొలాలు పాడవుతాయని ఇక్కడ షూటింగ్ చేయవద్దని కొటాలగూడ గ్రామస్తులు వాపోయారు. దీంతో బాలయ్య మూవీ యూనిట్ మరో లొకేషన్ వెతికే పనిలో పడిందట.