Corona Cases Telangana: తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రోజు కొత్తగా 114 కరోనా పాజీటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,712కి చేరింది. ఆదివారం ఇద్దరు కరోనాతో మృతి చెందడంతో.. ఇప్పటి వరకు మొత్తం 1,625 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1,701 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 2,94,386 మంది రికవరీ అయ్యారు. కాగా, పలు రాష్ట్రాల్లో కరోనా మరోసారి వ్యాప్తి చెందుతుండటం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.