Gold Price Today: బంగారం ధరల నేలచూపులు చూస్తుండడం కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. ఒకనొక సమయంలో తులం బంగారం రూ.55 వేలకు చేరువైన సందర్భాలు చూశాం. అయితే ప్రస్తుతం మాత్రం బంగారం ధరలు పతనమవుతున్నాయి. శనివారం కూడా దేశీయ మార్కెట్లో బంగారు ధరలు తగ్గాయి. ఈరోజు దేశ వ్యాప్తంగా 10 గ్రాముల బంగారం ధర వివరాలు ఎలా ఉన్నాయంటే..
దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం శుక్రవారంతో పోలిస్తే రూ.400 తగ్గి, 22 క్యారెట్ల గోల్డ్ రూ.45,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 తగ్గి.. రూ.49,260వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికొస్తే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.560 తగ్గి, రూ.45,130 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే రూ.560 తగ్గి, రూ.46,130 వద్ద ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర నిన్నటితో పోలిస్తే రూ.400 తగ్గి, రూ.43,000 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే రూ.450 తగ్గి, రూ.46,900గా ఉంది. విజయవాడలోనూ బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రూ.43,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.450 తగ్గి, రూ.46,900 వద్ద ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.43,000గా నమోదైంది. 24 క్యారెట్ల విషయానికొస్తే రూ.450 తగ్గి.. రూ. 46,900 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.43,480 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,400 వద్ద కొనసాగుతోంది.