హైదరాబాద్ : మహబూబ్నగర్ - రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి గాను నామినేషన్లు ప్రారంభమైన మొదటి రోజైన మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలెకు భారతీయ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా సయ్యద్ ఫరీదుద్దీన్, ఆడపా సురేందర్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుం ది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మ॥ 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకై 200 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కేంద్రాలన్నింటిలోనూ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.