Staff Nurse Merit List: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ సవరణ జాబితాను టీస్పీఎస్సీ విడుదల చేసింది. మెరిట్ జాబితా టీఎస్పీఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. స్టాఫ్ నర్స్ పోస్టులకు మొత్తం 21,391 మంది అర్హత సాధించినట్లు వెల్లడించిన టీఎస్పీఎస్సీ.. 1:2 నిష్పత్తిలో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. స్టాఫ్‌నర్స్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు సంబంధిత తేదీన అవసరమైన ధ్రువపత్రాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. కాగా, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ గతంలోనే ప్రకటించింది. అయితే, అందులో అవకతవకలు జరిగినట్లు పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఆధారాలు కూడా చూపించారు. దాంతో టీఎస్పీఎస్సీ నాటి జాబితాను పరిశీలించి.. తాజాగా సవరణ జాబితాను ప్రకటించింది.