Today Fuel Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్. వరుసగా ఆరో రోజు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయించాయి. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజాగా పెరిగిన రేట్లతో హైరదాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 92.53 కు లభిస్తుండగా.. డీజిల్ రూ. 86.55 గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.10 ఉండగా, డీజిల్ లీటర్ రూ. 88.60 గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.94 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 87.47 గా ఉంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.99గా ఉంది. డీజీల్ లీటర్ ధర రూ. 79.35 గా ఉంది. అయితే, వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు నిత్యావసర ధరలు మండిపోతుండగా.. మరోవైపు పెట్రోల్, డీజీల్ ధరలు కూడా పెరిగితుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.