న్యూఢిల్లీ: సౌత్‌కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ M02 ఫోన్ విక్రయాలను తొలిసారి భారత్‌లో ప్రారంభించింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్, ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
శాంసంగ్ ఎం స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో గెలాక్సీ M51, గెలాక్సీ M31ఎస్, గెలాక్సీ M31 ఫోన్లను రిలీజ్ చేసింది. భారత్‌లో గెలాక్సీ ఎం02(2GB ర్యామ్ + 32GB స్టోరేజ్) ధర రూ.6,799గా ఉంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 7,299గా ఉంది. బ్లాక్, బ్లూ, గ్రే, రెడ్ కలర్లలో అందుబాటులో ఉంది
గెలాక్సీ ఎం2 స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే:6.50 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా:5 మెగా పిక్సెల్
రియర్ కెమెరా:13+2 మెగా పిక్సెల్
ర్యామ్:2జీబీ
స్టోరేజ్:16జీబీ
బ్యాటరీ:5000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 10