న్యూఢిల్లీ, జనవరి 18: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ) స్పోర్ట్స్ ఎడిషన్ ‘గ్రాజియా’ స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన 125 సీసీ ఇంజిన్‌తోపాటు ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్, ఇంజిన్ కటాఫ్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్‌ను కలిగి ఉండే ఈ మోడల్ ధరను రూ.82,564గా నిర్ణయించింది. ఇది గుర్గావ్ ఎక్స్-షోరూమ్ ధర. స్పోర్టీ కలర్, గ్రాఫిక్స్, రేసింగ్ స్ట్రైప్స్, ఎరుపు-నలుపు రంగులతో కూడిన రియర్ సస్పెన్షన్‌తో గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు హెచ్ఎంఎస్ఐ సోమవారం ఓ ప్రకటనలో వివరించింది.