హైదరాబాద్: నివర్ తుఫాన్ క్రమంగా తీవ్రత తగ్గి శుక్రవారం ఉదయానికి అల్పపీడనంగా మారింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ ప్రభావంతో చలిగాలులు వీస్తున్నాయి. శుక్రవారం చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతై ఉన్నది. దీంతోపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి.