వివాదాస్పద అయోధ్య భూమిని రామాలయ నిర్మాణం కోసం హిందువులకు ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలైంది. జమాతే ఉలేమా హింద్ ఇవాళ ఈ పిటిషన్ వేసింది. బాబ్రీ మసీదు స్థలాన్ని అప్పగించాలన్న తీర్పును మౌలానా సయ్యిద్ అశద్ రషీద్ తప్పుపట్టారు. వివాదాస్పద అయోధ్య భూమికి సంబంధించి లిటిగెంట్ సిద్దిక్కు వారుసుడే రషీద్. బాబ్రీ అంశంలో 1934, 1949, 1992లో జరిగిన నేరాలను సుప్రీం విస్మరించిందని రషీద్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. అడ్వకేట్ మక్బూల్ ద్వారా 217 పేజీల పిటిషన్ను ఆయన దాఖలు చేశారు. బాబ్రీ మసీదును హిందువులు కూల్చారని, అలాంటప్పుడు వారికే ఎలా తీర్పును అనుకూలంగా ఇస్తారని ఆయన తన పిటిషన్లో తెలిపారు. వివాదాస్పద భూమి ముస్లింల ఆధీనంలోనే ఉన్నట్లు ఆయన చెప్పారు.