కెనడా: కెనడా ప్రభుత్వంలో తొలిసారి ఓ హిందూ మహిళ మంత్రి అయ్యారు. టొరంటో వర్సిటీ ప్రొఫెసర్ అనితా ఆనంద్ ప్రజాసేవలు, సేకరణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరో ముగ్గురు సిక్కులు నవదీప్ బెయిన్స్(42), బర్దిష్ చగ్గర్(39), హర్జిత్ సజ్జన్(49)లకు కూడా మంత్రి పదవులు లభించింది. కెనడా ప్రధానిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన జస్టిన్ ట్రూడో 37మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.