ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.55 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 184 పాయింట్లు ఎగబాకి 40,236 వద్ద కొనసాగుతుండగా..జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11,901 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ వద్ద 70.54 కొనసాగుతుంది.