ఇండియా: చాలా రోజులుగా ఎదురుచూస్తున్న మారుతీ సుజుకీ XL6 MPV మోడల్ కారు ఈరోజు లాంచ్ అయింది. ఎర్టీగాకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఇది అందుబాటులోకి వచ్చింది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర 9.8లక్షలుగా ఉంది. అద్భుతమైన ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్ దీని సొంతం. లిమిటెడ్ షోరూంలు ఉన్నటువంటి నెక్సాలో మాత్రమే లభిస్తుంది. ముందు భాగంలో ఆకట్టుకునే హెడ్‌లైట్స్, అద్భుతమైన లెదర్ సీట్స్, ఆర్మ్‌రెస్ట్, ఇంకా ఎర్టీగాను మించిన ఫీచర్లను ఇందులో పొందుపర్చారు. ఎర్టీగాను పోలిన డ్యాష్ బోర్డు ఉంది. 7ఇంచ్‌ల టచ్‌స్క్రీన్‌తో పాటు ఇన్ఫోటైన్మెంట్ మ్యూజిక్ సిస్టమ్, 1.5లీటర్ల పెట్రోల్ ఇంజన్, 5మ్యాన్యువల్ గేర్లు, 4గేర్ల ఆటోమేటిక్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఆరు రంగులలో(నెక్సా బ్లూ, ఆర్బన్ రెడ్, ప్రీమియం సిల్వర్, బ్రేవ్ ఖాకీ, మాగ్మాగ్రే, ఆర్టిక్ వైట్) ఈ కారు లభిస్తుంది.